గట్టి పకోడి(Crispy Onion Pakoda)/Ullipaya Pakoda

కావలసిన పదార్థాలు:

ఉల్లిపాయ--1
శనగ పిండి--1 కప్
బియ్యప్పిండి--2 స్పూన్స్
కరివేపాకు--10 ఆకులు
వెల్లుల్లి--2 రెబ్బలు
పచ్చి మిర్చి--2
జీడిపప్పు--10
ఉప్పు--తగినంత
ఎర్ర కారం--1 /2 స్పూన్
వాము--1/4 స్పూన్
ఇంగువ--చిటికెడు
నూనె--3 కప్స్ వేయించడానికి


విధానము:

1.ఉల్లిపాయలు పొడవుగా తరిగి ఉంచుకోవాలి.

2. కరివేపాకు, పచ్చి మిర్చి, వెల్లుల్లి పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి.

3.ఒక గిన్నె లో ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి ,కరివేపాకు వేయాలి.

4.తరువాత ఉల్లిపాయల పై శనగ పిండి, బియ్యప్పిండి, ఎర్ర కారం, వాము, ఇంగువ, ఉప్పు వేయాలి.(ఉల్లిపాయల పై చిలకరించాలి)

5.తరువాత వాటిని బాగా కలపాలి.

6.నీరు వేయకుండా కలపాలి. అవసరమైతే తడి చేతితో కలపాలి.

7.శగగపిండి అంతా ఉల్లిపాయలకు పట్టేలా కలపాలి.

8.నూనె వేడికి పెట్టాలి.

9.నూనె వేడి అయ్యాక జాగ్రత్తగా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని పకోడి లా వేసుకోవాలి.

10.పకోడిలు ఎర్రగా వేగినాక ప్లేట్ లో తీసుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే గట్టి పకోడి రెడి.ఈ పకోడీలు డబ్బాలో వేసుకొని మూత పెట్టి,బయట పెట్టుకుంటే 3-4 రోజులు నిల్వ ఉంటాయి.(ఫ్రిడ్జ్ లో అవసరం లేదు)


No comments:

Post a Comment