కార్న్ పాల కోవా(Corn Milk kova)

కావలసిన పదార్థాలు :

పాలు--1 గ్లాసు
కార్న్ పిండి--1 టేబుల్ స్పూన్
ఏలకుల పొడి--1/4 స్పూన్
చెక్కర--3/4 కప్
నెయ్యి--2 టేబుల్ స్పూన్

విధానము:
1.పాలు వేడి చేయాలి.

2.తరువాత కొద్దిగా చల్ల పాల లో కార్న్ పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి.

3.స్టవ్ మీద పాలు పెట్టి, అందులో చెక్కర వేసి బాగా కలపాలి.

4.చెక్కర కరిగాక అందులో పాల లో కలిపిన కార్న్ పిండి వేసి ఉంటలు లేకుండా, మాడిపోకుండా కలపాలి.

5. తరువాత నెయ్యి వేసి, పాలను మాడిపోకుండా కోవాలా చిక్కపడే దాక తిప్పాలి.

6.తరువాత ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.

7.ఒక ప్లేట్ లో నెయ్యి రాసి అందులోకి చిక్కపడిన కోవా ను వేయాలి.8.తరువాత చల్లగా అయ్యాక ,ముక్కలు గా చేసి ప్లేట్ లో పెట్టుకోవాలి.ఎంతో రుచిగా ఉండే కార్న్ పాల కోవా రెడి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.
వంటకం పంపిన వారు:విజయలక్ష్మి,CA,USA.

No comments:

Post a Comment