కొబ్బెర బర్ఫీ (Coconut Burphy )

కావలసిన పదార్థాలు:

కొబ్బెర తురుము---1 కప్
చెక్కర---3/4 కప్
ఏలకుల పొడి--1/4 స్పూన్
నెయ్యి--3 స్పూన్స్
పచ్చ కర్పూరం--చిటికెడు
విధానము:

1.బానలిలో నెయ్యి వేసి కొబ్బెర తురుము పచ్చి వాసన పోయేలా వేయించాలి.

2.తరువాత వేయించిన కొబ్బెరలో చెక్కర వేసి, మాడిపోకుండా కలుపుతూ ఉండాలి.

3.మిశ్రమం అంతా బాగా కలిసి హల్వాల ముద్దలా తయరైనప్పుడు, ఏలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం, వేసి 1 నిముషం కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

4.తరువాత ఒక ప్లేట్ లో నెయ్యి రాసి, తయారు చేసిన మిశ్రమం వేయాలి.5.బర్ఫీ చల్లగా అయ్యాక, మీకు నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి.6.ఇలా కట్ చేసుకున్న కొబ్బెర బర్ఫీలను ప్లేట్ లో తీసుకోవాలి.ఎంతో రుచిగా ఉండే కొబ్బెర బర్ఫీ రేడి.

గమనిక: పచ్చ కర్పూరం వేయకపోయిన పర్లేదు గాని, ఎక్కువ వేస్తే బర్ఫీ చేదు వస్తుంది.

No comments:

Post a Comment