గోరుచిక్కుడు-ఆలుగడ్డ-వేరుశనగ సాంబార్(Clusterbeans,Potato,Peanut Sambar)

కావలసిన పదార్థాలు:

కంది పప్పు ---- 1 గ్లాసు
ఆలు గడ్డ ---- 2
మట్టికాయలు/గోరుచిక్కుడు ---- 1 కప్
వేరుశనగ పప్పు ---- 1 కప్
పచ్చికొబ్బెర ---- 2 స్పూన్స్
సాంబార్ పొడి ---- 2 స్పూన్స్
చెక్క ----2 పీస్
పసుపు ----1/4 స్పూన్
ఉప్పు-----తగినంత
చింతపండు పులుసు ---1 స్పూన్
తిరగమాత/తాలింపు గింజలు
ఇంగువ ----చిటికెడు
కరవేపాకు---2 రెమ్మలు
కొత్తిమీర----2 రెమ్మలు


విధానము:

1.కందిపప్పు , తరిగి ఉంచిన గోరుచిక్కుడు కాయలు, ఆలుగడ్డ ముక్కలు, వేరుశనగపప్పు బాగ కడిగి, కుక్కర్ లో పెట్టి 2 విసిల్స్ రానివ్వాలి.

2.తరువాత గిన్నె పెట్టి, కొంచం నూనె వేసి, ఉద్దిపప్పు, శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు , చెక్క, వేసి తాలింపు పెట్టుకోవాలి.

3.తరువాత అందులోకి ఉడికించిన పప్పు, వేరు శనక్కాయలు ,ఉర్లగడ్డలు, గోరుచిక్కుడు కాయలు, కొంచం నీరు పోసి జారుగా చేసుకోవాలి.

4.తరువాత సాంబార్ పొడి వేసి ,తగినంత ఉప్పు ,చింతపండు పులుసు వేసి , బాగ మరగ నివ్వాలి.

5.చివరి లో పచ్చి కొబ్బెర , కొత్తిమీర ,కరివేపాకు వేసి, స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా వుండే గోరుచిక్కుడు -ఆలుగడ్డ-వేరుశనగ సాంబార్ రెడి.


No comments:

Post a Comment