చుడువా/మసాల అటుకులు(Chuduva/Masala Poha)

కావలసిన పదార్థాలు:

అటుకులు--1/2 కేజి
నూనె--1 టేబుల్ స్పూన్
ఉద్దిపప్పు--2 స్పూన్స్
శనగ పప్పు--2 స్పూన్స్
ఆవాలు--1 స్పూన్
జీలకర్ర--1 స్పూన్
ఇంగువ-- 1/4 స్పూన్
పసుపు--1/2 స్పూన్
వేరు శనగ పప్పు--2 టేబుల్ స్పూన్స్
పప్పులు--2 స్పూన్స్
జీడిపప్పు--2 టేబుల్ స్పూన్స్
ఉప్పు తగినంత
కారం---1/4 స్పూన్
కరివేపాకు---3 రెమ్మలు
కొబ్బెర ముక్కలు--2 టేబుల్ స్పూన్స్
చెక్కర--2 స్పూన్స్

విధానము:

1.స్టవ్ మీద ఒక పెద్ద బాణలి లో అటుకులు వేసి కొద్దిగా వేడి అయ్యేలా వేయించి పక్కన పెట్టుకోవాలి.(నూనె వేయకుండా)

2.వేరు శనగ విత్తనాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.

3.తరువాత బాణలి లో నూనె వేసి వేడి అయ్యాక, ఉద్దిపప్పు, శనగ పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగినాక, స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ ,పసుపు, కారం, కరివేపాకు, జీడిపప్పు, వేరు శనగ పప్పు, కొబ్బెర ముక్కలు, పప్పులు వేసి బాగా కలపాలి.

4.తరువాత అందులోకి వేయించిన అటుకులు వేసి బాగా కలపాలి.

5.చివరిలో 2 స్పూన్స్ చెక్కర వేసి కలపాలి.

ఎంతో రుచిగా ఉండే చుడువా/మసాల అటుకులు రెడి.

ఇష్టమున్న వారు ఎండు ద్రాక్ష, కార్న్ ఫ్లేక్స్, చిప్స్, బూంది కూడా వేసుకోవచ్చు.


No comments:

Post a Comment