శనగల వేపుడు కూర/ డ్రై చోలే (Chole Dry Curry)

కావలసిన పదార్థాలు:

శనగలు----1 కప్
టమొటా----1
ఆలుగడ్డ---1
చోలే మసాల----1 స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్----1 స్పూన్
పసుపు---1/4 స్పూన్
ఎర్ర కారం---1 స్పూన్
కొత్తిమీర---2 రెమ్మలు
ఉప్పు--- తగినంత
నూనె--- 2 స్పూన్

విధానము:

1.శెనగలు కడిగి, ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి.

2.ఉల్లిపాయలు,ఆలుగడ్డ,టమొటా చిన్నగా తరిగి ఉంచుకోవాలి.

3.బానలి నూనె వేసి. వేడి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.

4.తరువాత ఉల్లిపాయలు ,చిటికెడు ఉప్పు వేసి గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.(ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి)

5.తరువాత టమొటా, ఎర్ర కారం, పసుపు, చోలే మసాల వేసి టమొటాలు బాగా వేగనివ్వాలి.

6.తరువాత ఉడికించిన శనగలు వేసి, తగినంత ఉప్పు వేసి మసాల అంతా బాగా కలిసే లా కలిపి,5 నిముషాలు మూత పెట్టాలి.

7.తరువాత మూత తీసి బాగా కలిపి, గిన్నె లో తీసుకొని కొత్తిమీర చల్లాలి.

ఎంతో రుచిగా ఉండే శనగల వేపుడు కూర రెడి. ఈ కూర పరాట/జీరా రైస్/రోటి తో చాలా బాగుంటుంది


No comments:

Post a Comment