చెన్న మసాల(Channa Masala)

కావలసిన పదార్థాలు:(నలుగురికి సరిపడా)

శనగలు/కాబూలి చెన్న ----1 గ్లాసు
ఉల్లిపాయ ----1 చిన్నది
టమొటా ----- 2 చిన్నవి
అల్లం , వెల్లుల్లి పేస్ట్ ---- 1 స్పూన్
గరం మసాల ----1 స్పూన్
కారం పొడి ---- 1/2 స్పూన్
ఉప్పు ---- తగినంత
నిమ్మకాయ రసం ---- 2 స్పూన్స్
జీలకర్ర ----1 స్పూన్
షాజీరా ----1/2 స్పూను
చెక్క --- 2 పీస్
లవంగాలు----3
నెయ్యి --- 1/2 స్పూన్
నూనె ----1 స్పూన్
పసుపు ---- 1/2 స్పూన్
కొత్తిమీర ---- 2 రెమ్మలు


విధానము:

1.మొదట శనగలు/చెన్న 6 గంటలు నాన బెట్టాలి.

2.నాన బెట్టిన శనగలు/చెన్న ఉడికించాలి.

3.ఉల్లిపాయ,వెల్లుల్లి, టమొటా, అల్లం గ్రైండ్ చేయాలి.

4.బానలి లో, కొంచం నూనె, నెయ్యి వేసి, వేడి అయ్యాక, జీలకర్ర ,షాజీర, లవంగాలు,చెక్క వేయాలి, తరువాత పసుపు వేయాలి.

5.తరువాత గ్రైండ్ చేసిన (ఉల్లిపాయ+టమొటా,అల్లం+వెల్లుల్లి) పేస్ట్ వేయాలి.

6.పచ్చివాసన పోయేదాక వేయించి , గరం మసాల ,కారం వేయాలి.

7.తరువాత ఉడికించిన శనగలు/చెన్న వేయాలి.

8.మధ్య మధ్య లో , నీరు వేయాలి, అప్పుడు అంతా బాగా కలుస్తుంది.

9.తరువాత ఉప్పు వేయాలి.

10.చివరన కొత్తిమీర వేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక. నిమ్మరసం వేయాలి.

ఎంతో రుచిగా ఉండే శనగలు/చెన్న మసాల రెడి.ఈ కూర చపాతి/పూరీ/రోటితో తింటే చాలా బాగుంటుంది.
No comments:

Post a Comment