శనగ పప్పు-బీరకాయ కూర(Channa Dal – Ridge Gourd Curry)

కావలసిన పదార్థాలు:

బీరకాయ--2
శనగ పప్పు--1/2 కప్
ఉల్లిపాయ--1
టమొటా--1
పచ్చి మిర్చి--2
ఎర్ర కారం - 1/4 స్పూన్
ఉప్పు--తగినంత
నువ్వులు--1/2 స్పూన్
పసుపు—చిటికెడు
ఇంగువ —చిటికెడు
నూనె--3 స్పూన్స్
కొత్తిమీర--2 రెమ్మలు
తిరగమాత గింజలు:
ఆవాలు--1/4 స్పూన్
జీలకర్ర--1/4 స్పూన్
ఉద్దిపప్పు--1/4 స్పూన్

విధానము:

1.శనగ పప్పు కొద్దిగా నీరు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

2.నువ్వులు పొడి చేసి పక్కన పెట్టుకోవాలి( వేయించ నవసరం లేదు)

3.ఉల్లిపాయలు,టమోటా,పచ్చి మిర్చి, కొత్తిమీర చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

4.బాణలి లో నూనె వేసి తిరగమాత గింజలు వేసి వేగినాక పసుపు, ఇంగువ వేయాలి.

5.తరువాత ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.

6.తరువాత బీరకాయ ముక్కలు, టమొటా, మిర్చి వేసి బాగా వేయించాలి.

7,తరువాత ఉడికించిన శనగ పప్పు, నువ్వుల పొడి, ఉప్పు, ఎర్ర కారం వేసి బాగా కలిపి 2 నిముషాలు వేయించాలి.

తరువాత చివరి లో కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే శనగ పప్పు-బీరకాయ కూర రెడి. ఇది అన్నం/చపాతి తో చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment