కాప్సికం వెజిటబుల్ కూర (Capsicum Veg Curry )

కావలసిన పదార్థాలు(ముగ్గురికి సరిపడా):

కాప్సికం---3
ఆలు గడ్డలు--2
కారెట్---2
పచ్చి బఠానీలు---1/4 కప్
ఎర్ర కారం--1/2 స్పూన్
వేరు శనక్కాయలు---1/4 కప్
నువ్వులు---1/4 స్పూన్
ధనియాల పొడి---1/4 స్పూన్
జీలకర్ర పొడి--1/4 స్పూన్
ఉప్పు---తగినంత
కొబ్బెర---2 స్పూన్స్
జీడిపప్పు---10
తిరగమాత గింజలు:(అన్నీ 1/4 స్పూన్)
ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర
ఏలకులు---2
చెక్క--2 పీసెస్
లవంగాలు--2
ఇంగువ--చిటికెడు

విధానము:

1.వేరుశనక్కాయలు,నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి.

2.కాప్సికం,కారెట్,ఆలుగడ్డలు బాగా కడిగి, చిన్న ముక్కలు గా చేసుకోవాలి.

3.బానలి పెట్టి,2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు ,దాల్చిన్ చెక్క, లవంగాలు, ఏలకులు వేయాలి.

4.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, ఆలుగడ్డ ముక్కలు వేయాలి.

5.కొంచం ఆలు గడ్డలు వేగినాక, కారెట్, కాప్సికం, నానపెట్టిన పచ్చి బఠానీలు వేసి బాగా కలిపి, మూత పెట్టాలి.

6. కూరలు అన్నీ వేగినాక, వేరు శనక్కాయల పొడి, నువ్వుల పొడి, ఎర్ర కారం ,కొబ్బెర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.

7.చివరిలో కొత్తిమీర , కరివేపాకు, జీడిపప్పు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే కాప్సికం-వెజిటబుల్ కూర రెడి. ఈ కూర అన్నం లోకి ,చపాతి లోకి బాగుంటుంది.


No comments:

Post a Comment