క్యాప్సికం బజ్జి (Capsicum Bajji)

కావలసిన పదార్థాలు:

క్యాప్సికం--2
శనగ పిండి---1 1/2 కప్
జీలకర్ర పొడి---1/4 టీ స్పూన్
ఎర్ర కారం--1 /2టీ స్పూన్
ఉప్పు---తగినంత
పసుపు--1/4 స్పూన్
ఇంగువ--చిటికెడు

విధానము:

1.క్యాప్సికం బాగా కడిగి, పొడవుగా కట్ చేసుకోవాలి.2.ఒక గిన్నె లో శనగ పిండి, ఎర్ర కారం, జీలకర్ర పొడి, ఉప్పు, ఇంగువ వేసి కొద్దిగా నీరు వేసి జారుగా కాకుండా, పకోడి పిండి లా కలుపుకోవాలి.3.నూనె వేడికి పెట్టాలి.

4.నూనె వేడి అయ్యాక, పిండిలో పొడవుగా తరిగిన క్యాప్సికం ముంచి, నూనె లో వేయాలి.5.క్యాప్సికం రెండు వైపులా గోధుమ రంగు లో వేగినాక ప్లేట్ లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం బజ్జి రెడి.


No comments:

Post a Comment