క్యాబేజి ఉద్ది వడ (Cabbage-Urad Vada)

కావలసిన పదార్థాలు:

ఉద్దిపప్పు --- 1 కప్
శనగ పప్పు ----1 స్పూన్
క్యాబేజి (కోసు కూర)---1/4(చిన్నది)
పచ్చి మిరపకాయలు ---- 4
అల్లం --- చిన్న ముక్క
ఉప్పు---- తగినంత
నూనె ----2 కప్ (వేయించడానికి)
కరివేపాకు --- 2 రెమ్మలు
వంట సోడ --- చిటికెడు (1/8 స్పూన్)

విధానము:

1.ఉద్దిపప్పు,1 స్పూన్ శనగ పప్పు 2 గంటలు నాన పెట్టుకోవాలి.

2.క్యాబేజి, ఉల్లిపాయ , పచ్చి మిర్చి , అల్లము బాగా చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి.

3.నానపెట్టిన ఉద్దిపప్పు మెత్తగా రుబ్బు కోవాలి.

4.మెత్తగా రుబ్బిన పిండిలో తరిగి ఉంచిన క్యాబేజి, మిర్చి,అల్లము, కరివేపాకు, ఉప్పు,చిటికెడు వంట సోడ వేసి బాగా కలుపుకోవాలి.

5.స్టవ్ మీద నూనె పెట్టి,వేడి అయ్యాక గుండ్రంగా చేసి మధ్యలో రంధ్రం పెట్టి వడ చేసి వేయాలి.

6.ఒక వేల వడ వేయడం రాకపోతే, ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఒక చుక్క నూనె వేసి, పిండి గుండ్రంగా చేసి, మధ్య లో రంద్రం పెట్టి వడను నూనె లో వేయించాలి.

ఎంతో రుచిగా ఉండే క్యాబేజి ఉద్ది వడ రెడి.


No comments:

Post a Comment