క్యాబేజి పకోడి (Cabbage Pakoda)

కావలసిన పదార్థాలు:

క్యాబేజి --1 చిన్నది
పచ్చి మిర్చి-4
కరివేపాకు--10
శనగ పిండి--1 కప్
జీడిపప్పు--10-15
ఇంగువ--చిటికెడు
ఉప్పు--తగినంత
నూనె--వేయించడానికి

విధానము:

1. క్యాబేజి, పచ్చి మిర్చి చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

2.కట్ చేసిన వాటి మీద తగినంత ఉప్పు, ఇంగువ వేయాలి.

3.తరువాత దాని పై శనగ పిండి చల్లి బాగా కలపాలి.

4.ఇలా కలిపిన క్యాబేజి మిశ్రమాన్ని 5-10 నిముషాలు పక్కన పెట్టాలి.

5.తరువాత క్యాబేజి లో ఉన్న నీరును పకోడికి సరిపడా ఉంచి, మిగిలిన నీరును పిండేయాలి.

( ఈ పకోడికి నీళ్ళు వేయరాదు. ఎందుకంటే క్యాబేజి లో నీరు ఉంటుంది కాబట్టి)

6.తరువాత జీడిపప్పు, కరివేపాకు వేసి బాగా కలపాలి.

7.బానలి లో నూనె వేడికి పెట్టి, వేడి అయ్యాక జాగ్రత్తగా క్యాబేజి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉంటలు గా వేయాలి.

8. పకోడిలను గోధుమ రంగు వచ్చేలా రెండు వైపులా వేయించాలి.

ఎంతో రుచిగా ఉండే క్యాబేజి పకోడి రెడి. ఇది కెట్చప్/సాస్ తో తింటే చాలా బాగుంటుంది.


No comments:

Post a Comment