మజ్జిగ/ సొంటి మజ్జిగ (Butter Milk / Sonji Majjiga)

కావలసిన పదార్థాలు: (నలుగురికి సరిపడా)

పెరుగు ----3 కప్స్
సొంటి----చిన్న ముక్క
ఉప్పు-----1 స్పూన్
కరివేపాకు---5
కొత్తిమీర---1/4 కట్ట

తిరగమాత:
ఆవాలు ---1/4 స్పూన్
జీలకర్ర ---1/4 స్పూన్
ఇంగువ----చిటికెడు

విధానము:

1.ఒక గిన్నె లో పెరుగు వేసి,(పాల లాగా) బాగా చిలకాలి.

2.చిన్నగా తరిగిన కరివేపాకు, ఉప్పు చిలికిన మజ్జిగ లో వేయాలి.(మిక్సీ లో కూడా వేసుకోవచ్చు)

3.సొంటి పొడి చేసి మజ్జిగ లో వేయాలి.(సొంటి లేకపొతే అల్లము తురిమి కూడా వేసుకోవచ్చు)

4.తరువాత తిరగమాత , చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి.

5.ఎలా తయారు చేసుకున్న మజ్జిగ లో(చల్లదనానికి) ఐస్ ముక్కలు వేసుకోవాలి, లేదా మజ్జిగ గిన్నె కు తడి బట్ట చుట్టాలి.

ఎంతో రుచిగా ఉండే చల్లని మజ్జిగ రెడి.

చిట్కా : దేహానికి, వేడి చేసినప్పుడు మజ్జిగ తాగితే వెంటనే చల్లబడుతుంది. ఎక్కువ తాగితే చలువ చేసి జలుబు చేస్తుంది.


No comments:

Post a Comment