బూంది లడ్డు (Boondi Laddu)

కావలసిన పదార్థాలు :

నూనె---- 3 గ్లాసులు
శనగ పిండి --2 గ్లాసులు
చెక్కర -- 2 గ్లాసులు
నీరు -- 2 గ్లాసులు
పచ్చకర్పూరము -- చిటికెడు
నెయ్యి --- 4 స్పూన్స్
జీడిపప్పు---15
ద్రాక్ష----15
ఏలక్కుల పొడి---1 స్పూన్
కలకండ పలుకులు/ పటిక బెల్లం---3 స్పూన్స్(ఇష్ట మైతే)
బూంది గరిట(చిల్లుల గరిట)

విధానము:

1.ఒక గిన్నె లో చెక్కర వేసి, చెక్కర మునిగే లా నీరు వేయాలి.


2.తరువాత స్టవ్ మీద పెట్టి తీగ పాకం చేసుకోవాలి.


3.తరువాత నెయ్యి లో జీడిపప్పు, ద్రాక్ష వేయించుకోవాలి.


4.పాకము లో వేయించిన జీడిపప్ప, ద్రాక్ష వేసి పక్కన పెట్టుకోవాలి.


5.తరువాత నూనె వేడి కు పెట్టాలి.


6.నూనె వేడి అయ్యెలోపు శనగ పిండి ,నీరు (శనగ పిండి 2 గ్లాసులు+ నీరు 2 గ్లాసులు) వేసి కొంచము జారు గా, బూంది వచ్చెలా కలుపుకోవాలి.


7.నూనె వేడి అయ్యాక బూంది గరిటలో కొద్దిగా శనగ పిండి వేసి బూంది చేసుకోవాలి.8.ఇలా చేసిన బూందిని తయారు చేసుకున్న పాకములో వేసుకోవాలి.

9.పాకము వున్నంత వరకే బూంది వేయాలి.


10.తరువాత చివరిలో పచ్చ కర్పూరము, ఏలకుల పొడి, కలకండ పలుకులు వేసి బాగా కలపాలి.

11.తరువాత కొద్ది కొద్దిగా బూంది ని గిన్నెలో తీసుకొని లడ్డులా కట్టుకోవాలి.( మిగిలిన బూంది పై మూత పెట్టాలి.లేకపోతే బూంది గాలికి ఆరి లడ్డు కట్టడం కష్టమౌతుంది)

అంతే ఎంతో రుచిగా ఉండే బూంది లడ్డు రెడి.

గమనిక:బూంది పొడి పోడి ఉండి లడ్డు కట్టడం కష్టమైతే కొద్దిగా పాలు వేసి కట్టుకోవచ్చు.


No comments:

Post a Comment