బొంబాయి చట్ని/సాగు(Bombayi Chutney/Saagu)

కావలసిన పదార్థాలు:

ఆలుగడ్డలు--1
ఉల్లిపాయ--1
టమొటా--1
పచ్చి మిర్చి--3-4
శనగ పిండి--3-4 స్పూన్స్
కరివేపాకు--10
కొత్తిమీర--2 రెమ్మలు
ఉప్పు--తగినంత
పసుపు--చిటికెడు

తిరగమాత గింజలు:
శనగ పప్పు--1/4 స్పూన్
ఆవాలు--1/4 స్పూన్
జీలకర్ర1/4 స్పూన్
ఉద్దిపప్పు1/4 స్పూన్
ఇంగువ--చిటికెడు
నూనె--3 స్పూన్స్

విధానము:

1.ఉల్లిపాయలు, ఆలుగడ్డ, టమొటా, పచ్చి మిర్చి పొడవుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2.తరువాత బాణలి పెట్టి, అందులో 3 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక తిరగమాత గింజలు వేసి వేయించాలి. తరువాత పసుపు వేయాలి.3.తరువాత తరిగి ఉంచిన ఆలుగడ్డలు వేసి వేయించాలి.4.ఆలుగడ్డలు కొద్దిగా వేగినాక పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి.5.తరువాత టమొటా ముక్కలు వేసి వేయించాలి.(ఉల్లిపాయలు వేగినాక టమొటా వేయాలి)6.తరువాత పచ్చి మిర్చి వేసి వేయించాలి.7.మిశ్రమం అంతా బాగా వేగినాక శనగ పిండి జారుగా కలిపి వేయాలి.8.కూర గట్టిగా ఉంటే నీరు వేసుకోవాలి.

9.తరువాత ఉప్పు వేసి బాగా కలిపి 3 నిముషాలు ఉడికించాలి.

10.చివరిలో కొత్తిమీర, కరివేపాకు వేసి 1 నిముషము ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.ఎంతో రుచిగా ఉండే బొంబాయి చట్ని/సాగు రెడి. ఇది చపాతి/పూరీ తో తింటే చాలా బాగుంటుంది.
No comments:

Post a Comment