అలసందల కూర (Black Eyed Beans Curry)

కావలసిన పదార్థాలు:

అలసందలు---1 కప్
కాప్సికం--1
ఎర్ర కారం--1/2 టీ స్పూన్
అల్లం--చిన్న ముక్క
పచ్చి మిర్చి--2
నూనె --2 స్పూన్స్
తిరగమాత గింజలు:(అన్నీ1/4 టీ స్పూన్)
శనగ పప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు

విధానము:

1.అలసందలు 3 గంటలు నానపెట్టాలి.

2.నానిన అలసందలు కుక్కర్ లో పెట్టి,1 విసిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.

3.తరువాత బానలి లో నూనె వేసి వేడి అయ్యాక ,తిరగమాత గింజలు వేసి వేయించాలి.

4.తరువాత కట్ చేసిన కాప్సికం, అల్లం, పచ్చి మిర్చి వేసి వేయించాలి.

5.తరువాత ఉడికించిన అలసందలు, పసుపు ,ఎర్ర కారం, ఉప్పు వేయాలి.

6.తరువాత కాప్సికం ఉడికెంతవరకు బానలి పై మూత పెట్టాలి.

7.తరువాత కూర బాగా ఉడికినాక, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే అలసందల కూర రెడి. ఈ చపాతి తో తింటే చాలా బాగుంటుంది.


No comments:

Post a Comment