నించుడు కాకరకాయ (Bitter Gourd Stuffed Curry)

కావలసిన పదార్థాలు:

కాకరకాయలు--6
శనగపప్పు -- 2స్పూన్స్
మినపప్పు--2స్పూన్స్
ధనియాలు ---1 స్పూన్
కొబ్బరి---1 ముక్క
జీలకర్ర--- 1 స్పూన్
మెరపకాయలు -- 6
ఉప్పు--- తగినంత
నూనె ---1 కప్పు

విధానము:

1.కాకరకాయలను శుభ్రం చేసి,వాటిని నిలువుగా గాటు పెట్టి,లోపల గింజలను తీసి పక్కన పెట్టాలి.

2.స్టవ్ మీద బాణలి పెట్టి కొంచెం నూనె వేయాలి.

3.దానిలోమిరపకాయలు,శనగపప్పు,మినపప్పు,ధనియాలు,జీలకర్ర,కొబ్బరి వేసుకొని వేయించాలి.

4.అది చల్లారాక మిక్సీలో పొడి చేసుకొని ఉప్పు కలపాలి.

5.కాకరకాయను తీసుకొని మధ్యలో నెమ్మదిగా పొడి ని నింపాలి.

6.పొడి కూరిన కాకరకాయలను గిన్నెలో పెట్టి కుక్కర్ లో 10 నిముషాలు ఉడికించాలి.

7.ఉడికిన కాకరకాయలను చల్లార్చి, స్టవ్ మీద బాణలి పెట్టి దానిలో నూనె వేడి చేయాలి.

8.నెమ్మదిగా కాకరకాయలను వేసి ఎక్కువ సెగ కాకుండా ఎర్రగా వేయించుకోవాలి.

అంతే వేడి వేడి నించుడు కాకరకాయలు అన్నములో తినటానికి రెడి.

వంటకం పంపిన వారు విజయలక్ష్మి,అమెరికా.


No comments:

Post a Comment