బెండకాయ మసాల(బిండి దో ప్యాజా) Bindi masala/Bindi Do Pyaza

కావలసిన పదార్థాలు:

బెండకాయలు---1/2 కేజి
ఉల్లిపాయ---2
టమొటా---1
ధనియాల పొడి---1 స్పూన్
జీలకర్ర పొడి---1 స్పూన్
గరం మసాల---1/2 స్పూన్
నిమ్మకాయ---1
ఎర్ర కారం--1 స్పూన్
పచ్చి మిర్చి---2 లేక 3
నూనె---2 స్పూన్స్
జీలకర్ర---1 స్పూన్


విధానము:

1.బెండకాయలు బాగా కడిగి, తడి లేకుండా బట్టతో తుడవాలి.

2.బెండకాయలు కొంచం పెద్దవిగా కట్ చేసి, మధ్యకు చీల్చి రెండు ముక్కలుగా చేసుకోవాలి.

3.ఉల్లిపాయలూ,టమోటా,పచ్చి మిర్చి పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

4.బానలి పెట్టి,2 స్పూన్స్ నూనె వేసి, బెండకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి.

5.అదే బానలి లో 1 స్పూన్ నూనె వేసి, జీలకర్ర వేయాలి.

6.తరువాత ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి.

7.తరువాత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తరిగిన టమొటా వేసి ,బాగా వేయించాలి.

8.ఉల్లిపాయలు,టమోటా బాగా వేగినాక, వేయించిన బెండకాయలు, గరం మసాల వేసి బాగా కలపాలి.

9.చివరిలో స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండాలి.

10.తయారైన కూరను గిన్నె లో తీసుకొని కొత్తిమీర వేయాలి.

ఎంతో రుచిగా ఉండే బెండకాయ మసాల/బిండి దో ప్యాజా రెడి.ఈ కూర అన్నము/రోటి తో చాలా బాగుంటుంది.


No comments:

Post a Comment