శనగ పిండి రిబ్బన్లు (Besan Ribbons)
కావలసిన పదార్థాలు:
బియ్యప్పిండి--3 కప్స్
శనగ పిండి--1 కప్
వాము--1 స్పూన్
ఉప్పు---తగినంత
ఎర్ర కారం --11/2 స్పూన్
ఇంగువ--1/2 స్పూన్
నూనె--3 కప్స్(వేయించడానికి)
విధానము:
1.పెద్ద గిన్నె లో బియ్యప్పిండి, శనగ పిండి, వాము, ఉప్పు, ఎర్ర కారం, ఇంగువ వేసి బాగా కలపాలి.
2.తరువాత 5 లేక 7 స్పూన్స్ వేడి నూనె వేసి, మిశ్రమాన్ని బాగా కలపాలి.
3.పిండి నూనె లో కలిపినాక, కొద్దిగా పిండి చేతితో పట్టుకుంటే ముద్దలాగా, బాల్ లా అతుక్కోవాలి. పొడి పొడి గా పడిపోకుండా ఉండాలి.(ఒకవేల పిండి పొడి పోడి గా రాలుతుంటే కొద్దిగా నూనే వేసుకోవాలి)
4.తరువాత పిండిలో కొద్ది కొద్దిగా నీరు వేస్తు, గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.(జారుగా కలపరాదు)
5.తరువాత నూనె వేడికి పెట్టాలి.
6.తరువాత కొద్దిగా పిండి తీసుకొని,మురుకుల గొట్టములో వేసి, చతురస్త్రం పేట్ పెట్టి, జాగ్రత్తగా వేడి నూనె లో పిండాలి.
7.రెండువైపులా మురుకులను పచ్చిదనం పోయేలా వేయించాలి.
8.వేయించిన మురుకులను ప్లేట్ లో పేపర్ వేసి, పేపర్ మీద తీయాలి.(పేపర్ లో వేయడం వల్ల ఎక్కువగా ఉండే నూనె, పేపర్ పీల్చుకుంటుంది).
ఎంతో రుచిగా ఉండే కరకరలాడే శనగపిండి రిబ్బన్లు రెడి.ఇవి డబ్బాలో వేసుకోని పెట్టుకుంటే నెల రోజులదాక నిల్వ ఉంటాయి.ఇవి మిక్చర్ లో కలుపుకొని తింటే చాలా బాగుంటాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment