అరటి పువ్వు కూర (Banana Flower Curry)

కావలసిన పదార్థాలు:

అరటి పువ్వు-- 1
పెసర పప్పు --1/4 కప్
చింతపండు -- నిమ్మకాయంత
నూనె -- 4 స్పూన్స్
కరివేపాకు -- 2 రెమ్మలు
పచ్చి మిరపకాయలు -- 8
కారం --- తగినంత
ఉప్పు-- తగినంత
ఎండు మిరపకాయలు-- 6

పోపు గింజలు :
శనగ పప్పు- 1 స్పూన్
మినపప్పు 1స్పూన్
మెంతులు 1 /2 స్పూన్
ఆవాలు -1 స్పూన్
ఇంగువ --చిటికెడు

తయారు చేయు విధానం:

1. ముందుగా అరటి పువ్వుని వేరు చేసుకుని శుభ్రం చేసుకోవాలి.

2.తరువాత వాటిని సన్నగా తరిగి కొంచెం ఉప్పు వేసి బాగా కడగాలి.

3.ఒక పెద్ద గిన్నెలో అరటిపువ్వు తరుగు, పెసర పప్పు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అర కప్పు నీరు పోసి మూత పెట్టి 10 నిముషాలు ఉడికించాలి.

4.తరువాత దానిని వార్చి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి, దానిలో నూనె వేసి పోపు గింజలు వేసి, వేగాక పచ్చి మిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి .

6. దానిలో నాన పెట్టి, గుజ్జు తీసిన చింత పండు, ఉప్పు ,కారం వేసి, ఉడికించి పెట్టిన అరటి పువ్వు మిశ్రమం వేసి 5 నిముషాలు సన్నటి మంట మీద ఉడికించాలి.

అంతే వేడి వేడి నోరూరించే అరటిపువ్వు కూర రెడి.

అరటిపువు కూరలో మినపప్పు వడియాలు వేయించుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.

చిట్కా : దీనిలో మంచి పోషక పదార్ధాలు, మాంస కృత్తులు, మరియు పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అరోగ్యానికి చాలా మంచిది.

వంటకం పంపినవారు : విజయలక్ష్మి,అమెరికా


No comments:

Post a Comment