బాదుష(Badhusha/Balushahi)--(-method-2)

కావలసిన పదార్థాలు:

మైదా--3కప్స్
నెయ్యి--1 కప్
పెరుగు--1కప్
బేకింగ్ పౌడర్--1/2 స్పూన్
బేకింగ్ సోడ--1/4 స్పూన్
చెక్కర--3 కప్స్

విధానము:

1.ఒక గిన్నెలో మైదా వేసుకోవాలి.


2.తరువాత పెరుగు వేయాలి.


3.తరువాత నెయ్యి వేయాలి.


4.తరువాత బేకింగ్ పౌడర్ వేయాలి.


5.తరువాత బేకింగ్ సోడ వేయాలి.


6.తరువాత అన్నీ బాగా కలిపి కొద్దిగా నీరు వేసి పూరీ పిండిలాగా కలపాలి.7.తరువాత పిండిపై తడి బట్టను వేసి ఒక గంట సేపు నాన పెట్టాలి.


8.తరువాత నానిన పిండిని బాగా కలపాలి.(ఎక్కువ సేపు కలపడం అవసరం లేదు..ఎందుకుకంటే పిండి నాని బాగా మెత్తగా అయ్యి ఉంటుంది)


9.పిండిని చిన్న ఉంటలాగా గుండ్రంగా చేసుకోవాలి.


10. గుండ్రంగా చేసిన పిండి మధ్యలో బోటన వ్రేలితో వత్తాలి.


11.తరువాత పిండి అంచులను చిన్నగా ఒకదానిపై ఒకటి మడుచుకోవాలి.12.ఇలా మడిచిన బాదుషాలను ప్లేట్ లో పెట్టుకోవాలి.


13.తరువాత ఒక గిన్నెలో చెక్కెర వేసుకొని, చెక్కర మునిగేలా నీరు పోయాలి.


14.చెక్కర బాగా కరిగి తీగా పాకం చేసి పక్కన పెట్టుకోవాలి.


15.తరువాత పక్కన చేసి పెట్టుకున్న బాదుషాలను నూనె లో వేసి సన్నటి సెగలో ఎర్రగా వేయించాలి.


16.ఇలా వేయించిన బాదుషాలను పాకం లో వేయాలి.


17.పాకం లో వేసిన బాదుషాలను 2 నిముషాలు ఉంచాలి.


18.పాకం బాదుషాలకు పట్టినాకా ప్లేట్ లో పెట్టుకోవాలి.


అంతే ఎంతో రుచిగా ఉండే బాదుషా రెడి.

గమనిక: బాదుషాలు చేయడానికి ముందే పాకం చేసుకోవాలి. అంటే పిండి కలిపి గంటసేపు నాన పెట్టే సమయం లో పాకం చేసుకోవాలి.


No comments:

Post a Comment