అవియల్ (Avial)

కావలసిన పదార్థాలు:

పెరుగు--2 కప్స్
పచ్చికొబ్బెర తురుము --3/4 కప్స్
పచ్చి మిర్చి --5
జీలకర్ర --1/2 స్పూన్
కారెట్ --1
మునగ కాడలు --5-10
ఆలుగడ్డ --1
బీన్స్ -- 1/2 కప్
పచ్చి బఠానీలు --1/4 కప్
కరివేపాకు -- 5-10
ఉప్పు --- తగినంత

తిరగమాత గింజలు:
నూనె--1/4 స్పూన్
జీలకర్ర --1/4 స్పూన్
ఇంగువ --- చిటికెడు

విధానము:

1.కూరలు అన్నీ ముక్కలు గా కట్ చేసి ఉడికించుకోవాలి.

2.పచ్చి కొబ్బెర, పచ్చి మిర్చి,జీలకర్ర,2 కప్స్ పెరుగు వేసి గ్రైండ్ చేయాలి.

3.తరువాత గిన్నె లో ఉడికించిన కూరల లో గ్రైండ్ చేసిన పేస్ట్ వేయాలి.

4.తరువాత ఉప్పు ,కరివేపాకు వేసి బాగా ఉడికించాలి.

5.తరువాత చిన్న బానలి లో నూనె వేసి, వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి తిరగమాత వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే అవియల్ రెడి.


No comments:

Post a Comment