గోధుమ-కర్జూరం కేక్( Atta-Dates Burphy)

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి--2 కప్స్
నెయ్యి---1 కప్
కర్జూరం ముక్కలు--1 కప్
నట్స్---1/4 కప్ (బాదాం, జీడిపప్పు ముక్కలు)
ఏలకుల పొడి--చిటికెడు
బెల్లం--1 కప్
విధానము:

1.బానలి లో నెయ్యి వేసి వేడి చేయాలి.

2.తరువాత గోధుమ పిండి, బాదాం, జీడిపప్పు ముక్కలు వేసి, పచ్చి వాసన పోయేదాక వేయించాలి.

3.తరువాత బెల్లం వేసి, బాగా కరిగినాక బాగా కలపాలి.

4.కర్జూరం ముక్కలు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.

5.ప్లేట్ లో కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి.

6.గోధుమపిండి-కర్జూరం మిశ్రమము నెయ్యి పూసిన ప్లేట్ లో వేసి వేడల్పుగా చేయాలి.7.తరువాత 15-30 నిముషాలు కదపకుండా పక్కన పెట్టాలి.

8.తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.9.ఎంతో రుచిగా ఉండే గోధుమ-కర్జూరం బర్ఫీ రెడి.

చిట్కా: గోధుమ పిండి, బెల్లం, కర్జూరం అన్నీ అరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు కూడా ఈ స్వీట్ ఎంతో ఇష్టపడతారు.No comments:

Post a Comment