అలు-టిక్కి (Alu Tikki)

కావలసిన పదార్థాలు:

ఆలుగడ్డలు--3
బ్రెడ్ పొడి--3 స్పూన్స్
మిర్చి--2
కొత్తిమీర--2 రెమ్మలు
ధనియాల పొడి--1/4 టీ స్పూన్
జీలకర్ర పొడి--1/4 టీ స్పూన్
గరం మసాల--1/4 టీ స్పూన్
ఎర్ర కారం - 1/8 స్పూన్
ఉప్పు--తగినంత


విధానము:

1.ఆలు గడ్డలు ఉడికించి తొక్క తీసి, తురిమి పక్కన పెట్టుకోవాలి.

2.తరువాత గిన్నె లో తురిమిన ఆలుగడ్డలు, బ్రెడ్ పొడి(బ్రేడ్, టొస్ట్ చేసి పొడి చేసుకోవాలి),చిన్నగా కట్ చేసిన మిర్చి, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎర్ర కారం,గరం మసాల, ఉప్పు వేసి బాగా కలపాలి.3.తరువాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని, గుండ్రంగా టిక్కి లా చేసుకోవాలి.4.పెనం పైన నూనె వేసి, తయారు చేసుకున్న టిక్కి లని వేసి, రెండు వైపులా ఎర్రగా కాల్చాలి.ఎంతో రుచిగా ఉండే అలు-టిక్కి రెడి.ఈ టిక్కిలు సాస్ తో/పెరుగుతో/కెట్చప్/కోత్తిమీర చట్ని తో తింటే చాలా బాగుంటుంది.


No comments:

Post a Comment