ఆలు-చోలే మసాల/ఆలు-చెన్న మసాల (Alu-Chole Masala /Alu-Channa Masala)

కావలసిన పదార్థాలు:

శనగలు/చోలే--1 కప్
ఆలుగడ్డలు--2
ఉల్లిపాయ--1
టమొటా--1
పచ్చి మిర్చి--3
నెయ్యి/నూనె--4 స్పూన్స్
జీలకర్ర--1/4 స్పూన్
షాజీర--1/4 టీ స్పూన్
చెక్క--చిన్న ముక్క
లవంగాలు--3
జావెత్రి--చిన్న ముక్క
అల్లం వెల్లుల్లి పేస్ట్--1/2 స్పూన్
ఉప్పు--తగినంత
పసుపు--1/4 టీ స్పూన్
గరం మసాల--1/2 స్పూన్
ధనియాల పొడి--1/4 స్పూన్
జీలకర్ర పొడి--1/4 స్పూన్
కారం--1/4 స్పూన్

విధానము:

1.శనగలు 4-5 గంటలు నాన పెట్టి, ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

2.ఆలుగడ్డలు ఉడికించి పెక్కన పెట్టుకోవాలి.

3,ఉల్లిపాయలు,టమోటా,పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

4.బానలిలో 3 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక కట్ చేసిన ఉల్లిపాయలు, టమొటాలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి వేసి దోరగా వేయించాలి.

5.తరువాత వేయించిన కూరలు చల్లగా అయ్యాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

6.తరువాత బానలి పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, షాజీర, చెక్క, లవంగాలు, జావెత్రి వేసి దోరగా వేయించాల.

7. తరువాత ఉడికించిన ఆలుగడ్డలు కట్ చేసి వేసి 1 నిముషము వేయించాలి.

8.తరువాత గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి, పసుపు వేసి బాగా కలపాలి.

9.తరువాత గరం మసాల, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి.

10.తరువాత ఉడికించిన శనగలు వేసి బాగా కలిపి ఉడికించాలి.

11.తరువాత తగినంత ఉప్పు వేసి ఉడికించాలి.

12.కూరను కొద్దిగా నీరు వేసి జారుగా చేసుకోవాలి.(మరీ నీరు ఎక్కువ వేయరాదు)

13.చివరిలో కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే ఆలు-చెన్న మసాల రెడి. ఇది రోటీ/చపాతి/పరాట తో తింటే చాలా బాగుంటుంది.
No comments:

Post a Comment