ఆలు బోండా (Alu Bondaa)

కావలసిన పదార్థాలు:

శనగ పిండి---- 1 కప్
జీలకర్ర---1 స్పూన్
ఎర్ర కారం---1 స్పూన్
ఆలు గడ్డలు---4 లేక 6
పచ్చి మిర్చి---4
అల్లం----చిన్న ముక్క
ఉల్లిపాయలు---2
కరివేపాకు--- 5 లేక 10
పసుపు---1/2 స్పూన్
ఉప్పు----తగినంత
తిరగమాత గింజలు:
(అన్నీ 1/2 స్పూన్) శనగ పప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర
ఇంగువ---చిటికెడు
నూనె---- 2 కప్స్ (వేయించడానికి)

విధానము:

ఆలుగడ్డ కూర విధానము: 1.ఆలుగడ్డలు ఉడికించి, తొక్కలు తీసి , ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

2.ఉల్లిపాయలు పొడవుగా తరిగి ఉంచుకోవాలి.

3.పచ్చి మిర్చి, అల్లం, కరివేపాకు చిన్న తరిగి ఉంచుకోవాలి.

4.బానలిలో 2 స్పూన్స్ నూనె వేసి ,తిరగమాత గింజలు వేయాలి.

5.ఆవాలు చిట చిట అన్నాకా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.

6.తగినంత ఉప్పు కూడా వేయాలి.

7.ఉల్లిపాయలు ఎర్రగా వేగినాక, ఉడికించి, తొక్క తీసిన ఆలుగడ్డల ముక్కలు వేయాలి.

8.కొత్తిమీర,కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి.

అంతే ఆలుగడ్డ కూర రెడి.


ఆలు బోండా చేసే విధానము:

1.ఒక గిన్నె లో శనగ పిండి, జీలకర్ర పొడి, ఎర్ర కారం, ఉప్పు ,కొంచం నీరు వేసి గట్టిగా బోండా పిండి లా కలుపుకోవాలి.2.ఆలుగడ్డ కూరను చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.3.నూనె ను వేడి కి పెట్టాలి.

4.కలుపుకొన్న్న శనగ పిండి లో, గుండ్రంగా చేసుకున్న ఆలుగడ్డ కూరను ముంచి ,నూనె లో వేయాలి.5.ఆలుగడ్డ బోండాలను గోధుమ రంగు వచ్చెలా వేయించి ప్లేట్ లో తీసుకోవాలి.ఎంతో రుచిగా ఉండే ఆలు బోండా రెడి. కొత్తిమీర/కెచప్ తో తింటే చాలా బాగుంటుంది.


No comments:

Post a Comment