7కప్స్ స్వీట్(7 Cups Sweet)


కావలసిన పదార్థాలు:

చెక్కర ---3 కప్స్
శనగ పిండి---1 కప్
నెయ్యి---1 కప్
పాలు ---1 కప్
ఎండు కొబ్బెర పొడి--1 కప్
జీడిపప్పు---5
బాదాం---5
అక్రూట్--5
ఏలకులు --5విధానము:

1.బాణలి లో చెక్కర, పాలు వేసి కొద్దిగా కరిగినాక శనగ పిండి, కొబ్బెర, నెయ్యి వేయాలి.2.పైవన్నీ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.

3.తరువాత గ్రైండ్ చేసిన బాదాం, అక్రూట్, జీడిపప్పు, ఏలకులు  పొడి వేయాలి.4. పైవన్నీ బాణలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.

5.మిశ్రమం అంతా ముద్దగా అయ్యి బాణలికి అంటకుండా ఉన్నప్పుడు వెంటనే తీసి, నెయ్యి రాసిన ప్లేట్ లో వేయాలి.6.తరువాత ప్లేట్ లో వేసిన స్వీట్  మీకు నచ్చిన విధముగా, ముక్కలు గా కట్ చేయాలి.
7.తరువాత కట్ చేసిన ముక్కలపై జీడిపప్పు పెట్టాలి.(జీడిపప్పు వేడి మీద పెడితే అత్తుకుంటాయి)
8.చల్లగా అయ్యాక ముక్కలు గా తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే 7 కప్స్ స్వీట్ రెడి.

గమనిక: బాణలి లో పదార్థాలు విడి విడి గా కూడ వేసుకోవచ్చు.

No comments:

Post a Comment