పావ్ బాజి(Pav-Baaji)

కావలసిన పదార్థాలు:

పావ్స్/బన్నులు--(16 జతలు)
కాప్సికం--1 చిన్నది
ఉల్లిపాయ--1
టమొటా--1
పచ్చి మిర్చి--2లేక5
కాలిఫ్లవర్--1 కప్
పచ్చి బఠానీలు--1/2 కప్
కారెట్-1
బీన్స్--5-7
ఆలుగడ్డలు--2
ఎర్ర కారం--1 స్పూన్
పసుపు--1/2 టీ స్పూన్
ధనియాల పొడి--1 టీ స్పూన్
జీలకర్ర పొడి--1 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్--1 టీ స్పూన్
వెన్న(బటర్)--4 స్పూన్స్
ఉప్పు--తగినంత
పావ్ బాజి మసాల--1 టేబుల్ స్పూన్
నిమ్మకాయ రసం-- 2 టేబుల్ స్పూన్
కొత్తిమీర--2 రెమ్మలు

బాజి తయారు చేసే విధానము:

1.కారెట్,బీన్స్,కాలిఫ్లవర్,చిన్న ముక్కలు గా కట్ చేసి, పచ్చి బఠానీలు కూడా వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.

2.ఉల్లిపాయలు,కాప్సికం,టమోటాలు చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3.బానలిలో 2 టేబుల్ స్పూన్స్ వెన్న(బటర్)వేసి కాప్సికం వేసి వేయించాలి.

4.తరువాత కట్ చేసిన ఉల్లిపాయలు, టమొటాలు వేసి దోరగా వేయించాలి.

5.తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్ర కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి వేయించాలి.

6.తరువాత ఉడికించిన కూరలు వేసి వేయించాలి.

7.తరువాత కొద్దిగా నీరు వేసి మాడిపోకుండా కలపాలి.

8.తరువాత ఉడికించిన ఆలుగడ్డలు వేసి, గరిటతో కూరలు అంతా కనిపించకుండా మెత్తగా చేసి, బాగా కలపాలి.

9.తరువాత పావ్ బాజి మసాల వేసి బాగా కలపాలి.

10.తగినంత ఉప్పు వేసి,1 స్పూన్ బటర్ వేసి బాగా కలపాలి.

11.బాజి జారుగా రావడానికి కొద్దిగా నీరు వేసి బాగా కలపాలి.

12.ఇస్తమున్నవారు కొద్దిగా ఎరుపు కలర్ కూడా వేసి బాగా కలపాలి.

13.చివరిలో చల్లగా అయ్యాక నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి.

14.తరువాత కొత్తిమీర వేసుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే బాజి రెడి. దానిపై పచ్చి ఉల్లిపాయలు, టమొటాలు, కొత్తిమీర చిన్న కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది.


పావ్ చేసే విధానము:

1. మొదట పెనం వేడి చేయాలి.

2.తరువాత దానిపై 1/2 స్పూన్ బటర్ వేసి పెనంపై రాయాలి.

3.తరువాత బన్నులను/పావ్స్ ను రెండుగా కట్ చేయాలి.(బన్ను/పావ్ రెండుగా అంటుకొని ఉంటాయి)

4.బటర్ పూసిన పెనంపై పావ్ ఉంచాలి.(మొదట తెల్లగా ఉండే వైపు దోరగా కాల్చాలి. తరువాత బ్రౌన్ గా ఉండే వైపు కాల్చాలి.)

5.30 సెకనుల కన్నా ఎక్కువ వేడి అవసరం లేదు.(ఎక్కువ సేపు కాల్చనవసం లేదు.ఎక్కువ సేపు కాలిస్తే మాడిపోతాయి)

ఎంతో రుచిగా ఉండే వేడి బాజి తో పావ్ తింటే ఎంతో రుచిగా ఉంటుంది.


No comments:

Post a Comment