మసాల వడ (Masala Vada)

కావలసిన పదార్థాలు:

శనగ పప్పు --- 1 గ్లాసు
ఉల్లిపాయలు ---- చిన్నవి 2
పచ్చి మిర్చి ---- 3
ఎండు మిరపకాయలు ---1 లేక 2
ఉప్పు ----తగినంత
సోంపు --- 1/4 స్పూన్
కరివేపాకు ---- 2 రెమ్మలు
కొత్తిమీర ---2 రెమ్మలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ --- 1/4 స్పూన్
నూనె --- 2 కప్స్ (వేయించడానికి)

విధానము:

1.శనగ పప్పు 2 గంటలు నాన పెట్టుకోవాలి.

2.ఉల్లిపాయ, కొత్తిమీర చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి.

3.తరువాత పచ్చి మిర్చి, ఎండు మిరప, అల్లం వెల్లుల్లి పేస్ట్,సోంపు గ్రైండ్ చేసుకోవాలి.

4.ఇందులోనె నానపెట్టిన శనగ పప్పు కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి . అంటే మెత్తగా కాకుండ మెదిగి మెదగక గ్రైండ్ చేసుకోవాలి.

5. గ్రైండ్ చేసిన మిశ్రమాన్నిఒక గిన్నె లో తీసుకొని ,చిన్న గా తరుక్కొన్న ఉల్లిపాయలు, కొత్తిమీర , కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలపాలి.

6. తరువాత చిన్న గా వుంట చేసుకొని రెండు చేతుల మధ్యన పెట్టుకొని వత్తుకోవాలి.

7.అప్పుడు గుండ్రంగా కాకుం డా ఒవల్ గా వస్తాయి.

8.ఇలా చేసిన మసాల వడలను నూనె లో ఎర్రగా గా వేయించుకోవాలి.

అంతే ఎంతో రుచిగా ఉండే మసాల వడ రెడి.


No comments:

Post a Comment