వెన్న బిస్కెట్స్ (Butter Biscuits)

కావలసిన పదార్థాలు:

మైదా------------ 1 గ్లాసు
చెక్కర పొడి ------1/2 గ్లాసు
వెన్న ---------------1/2 గ్లాసు
బేకింగ్ పౌడర్ ----------1/2 స్పూన్
బేకింగ్ సొడా ----------1/2 స్పూన్
గుడ్డు (తెల్లసొన మాత్రమే)----1 గుడ్డు
వెనిలా ఎస్సెన్స్ -----------3 చుక్కలు


విధానము:

1. మైదా లో బేకింగ్ పౌడర్ , బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

2. ఒక గిన్నె లో గుడ్డు పగుల కొట్టి , తెల్లసొన ను వేసుకోవాలి. (ఇష్టం లేనివారు గుడ్డు వేసుకోకండి)

3. అందులో కి చెక్కర పొడి , వెన్న ,ఎస్సెన్స్ ,వేసి బాగా నురగ వచ్చెలా కలపాలి.

4. అందులో కొంచం కొంచం మైదా వేస్తూ , పూరి పిండి లా గట్టిగా కలుపుకోవాలి.

5. వెంటనే గాలి తగలకుండా మూత పెట్టాలి.

6. కొంచం కూడా నీళ్ళు వాడరాదు.

7. ఇలా మూత పెట్టిన పిండి ను ,6 లేక 7 గంటలు నాన నివ్వాలి.

8. తరువాత నానిన పిండి ని తీసి , చపాతి కన్నా కొంచం మందంగా వత్తుకోవాలి.

9. ఇలా వత్తిన చపాతి ని, మీకు నచ్చిన విధంగా గుండ్రంగా, డైమండ్ లా, స్వయర్ గా , కట్ చేసుకోవాచ్చు.

10. ఇలా చేసుకున్న బిస్కెట్స్ ను ఒవన్ లో పెట్టి, గోధుమ రంగు వచ్చేలా బేక్ చేసుకోవాలి.

అంతే ఎంతో రుచిగా ఉండే వెన్న బిస్కెట్స్ రెడి.

గమనిక: బిసికెట్స్ కు పిండి ముద్దగా రాకపొతే, నీళ్ళతో కలపకండి .కావాలంటే పాలు వేసుకోవచ్చు.బీట్రూట్ హల్వ (Beetroot Halwa)

కావలసిన పదార్థాలు:

బీట్రూట్ తురుము----1 గ్లాసు
చెక్కర---1 గ్లాసు
పాలు--1/4 గ్లాస్
నెయ్యి----1/4 గ్లాస్
ఏలకుల పొడి---1/2 స్పూన్
జీడిపప్పు--10విధానము:

1.బానలి లో నెయ్యి వేసి, బీట్రూట్ తురుము వేసి, దోరగా వేయించాలి.2.తరువాత పాలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి.

3.బీట్రూట్ పాలలో ఉడికి, మెత్తగా అయ్యాక ,చెక్కర, ఏలకుల పొడి వేయాలి.

4.చెక్కర,బీట్రూట్ బాగా కలిసి,ముద్దలా అయ్యాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.

5.నెయ్యి లో జీడిపప్పు దోరగా వేయించి హల్వాలో కలపాలి.

ఎంతో రుచిగా ఉండే,బీట్రూట్ హల్వా రెడి.